26-08-2025 03:08:39 AM
అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో కాఫీలను చించేసి నిరసన తెలిపిన కల్లుగీత సంఘాలు
ముషీరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): జీవో 93ను వెంటనే రద్దు చేయాలని, మూత పడ్డ కల్లు దుకాణాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై “తెలంగాణ గౌడ కల్లుగీత సమన్వయ సంఘాల సమన్వయ కమిటీ” ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జీ.ఓ 93 ను చించివేసి నిరసన వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, గౌడ కల్లుగీత సమన్వయ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ లతో కలసి పలువురు ఈ నిరసనలో పాల్గొని అంబేద్కర్ సాక్షిగా జి ఓ 93 కాపీలను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత సొసైటీలకు వైన్స్, బార్ల కేటాయింపులో 25 శాతం రిజర్వేషన్లు 50% సబ్సిడీ తో ఇచ్చి అమలు చేయాలన్నారు.మూతపడిన కల్లు దుకాణాలను వెంటనే తెరవాలన్నారు.