04-09-2025 11:13:59 PM
యాచారం: మండల పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామం(Singaram Village)లో విషాదం చోటుచేసుకుంది. కాన్పు కోసం వెళ్ళి బిడ్డ జన్మించిన అనంతరం తల్లి మృతి చెందింది. మహిళా మృతితో కుటుంబంలోనూ అటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మండల పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామానికి చెందిన దార నిర్మల రెండవ కాన్పు కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళింది. బుధవారం వైద్యుల నిర్ధారణ మేరకు నిర్మలకు పెద్దాపరేషన్ చేయాలని సూచించడంతో పెద్ద ఆపరేషన్ చేయగా పాప జన్మించింది. గురువారం ఉదయం ఆస్పత్రిలో నిర్మల బాత్రూం తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయింది. దీంతో ఆమెను మెరుగైన ఆరోగ్యం కోసమై గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే నిర్మల మృతి చెందింది. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్మలను పట్టించుకోకపోవడం వల్లే నిర్మల మృతి చెందిందని బంధువులు గ్రామస్తులు ఆరోపించారు.