calender_icon.png 11 September, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మ ఒడికి గణనాథుడు

08-09-2025 12:46:10 AM

  1. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్‌లో అత్యంత వైభవంగా నిమజ్జనోత్సవం
  2. ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనోత్సవం
  3. ప్రతిష్టించిన చోటే 54 అడుగుల గణనాథునికి నిమజ్జనం...
  4. శోభాయాత్రను పరిశీలించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు

ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి):  రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్‌లో అంత వైభవంగా నిర్వహించే వినాయక నిమజ్జోత్సవ శోభాయాత్ర ఘనంగా, శాంతియుతంగా ముగిసిం ది. జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన వందలాది గణనాధులకు ప్రజలు 11 రోజులపాటు పూజ లు అందించి శనివారం నిమజ్జనం చేశారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పా టు చేశారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు నిమజ్జనోత్సవం శోభాయాత్రను స్వయంగా పర్యవేక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ ల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. యువకులు  డిజె సౌండ్ సిస్టం, డప్పు చప్పుల కనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహం గా పాల్గొన్నారు. అటు మహిళలు యువతులు సైతం నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 

అనంతరం ఉమ్మడి జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది. శనివారం ప్రారంభ మైన నిమజ్జనోత్సవం శోభాయాత్ర, ఆదివా రం సాయంత్రం వరకు వినాయకుల నిమజ్జనం కొనసాగింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాత 54 అడుగు ల ఎత్తున భారీ వినాయక విగ్రహానికి  ప్రతిష్టించిన చోట నిమజ్జనం చేశారు. స్థానిక ఎమ్మె ల్యే పాయల్ శంకర్ బోర్ స్విచ్ ఆన్ చేయగా, మహాగణపతి పై నీటిదారతో నిమజ్జనం ప్రారంభమైంది.

పెన్ గంగ నదీ జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌లు యువకులతో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపా రు. శిక్షణ కలెక్టర్ సలోని, ఏఎస్పి కాజల్ సింగ్, ఆర్డీవో స్రవంతి, ఇందు అధ్యక్షులు బొంపల్లి హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా శోభాయాత్ర...

నిర్మల్ జిల్లా కేంద్రం తో పాటు వివిధ గ్రామాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ వార్డులో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను పట్టణంలో ఊరేగింపుగా నిర్వహించి బంగల్పెట్ వినాయక సాగర్ వరకు తరలించి అక్కడ పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాసర ఖానాపూర్ కుంటాల దిల్వార్పూర్ తదితర మండలాల్లో కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రను శోభయాత్ర నిర్వహించారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన బాసర పంచకూడి సోన్ బ్రిడ్జిపై వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు రెండు జిల్లాల చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను తరలించడంతో పోలీసులు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.

నిర్మల్ పట్టణంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్పీ అవినాష్ కుమార్ పరిపాలన ఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక సాగర్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ క్రేన్ల ను ఏర్పాటు చేయగా మున్సిపల్ విద్యుత్తు అగ్నిమాపక సిబ్బంది పోలీస్ శాఖ ఆధ్వర్యం లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

శోభ యాత్ర లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయా కాలనీలో పూజలు నిర్వహించి పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు భక్తులకు అన్నదానం పులిహోర పాకెట్లను అందజేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి