08-09-2025 12:50:19 AM
జహీరాబాద్, సెప్టెంబర్ 7 :జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వివిధ గ్రామాలలో నెల కొల్పిన గణేష్ ఉత్సవాల నిమజ్జనాన్ని యు వకులు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. పోలీసులు అన్ని ఉత్సవాల మంటపాల వద్ద గట్టిగా ఏర్పాటు చేసి ఎలాంటి అలజడులు జరగకుండా పహారా నిర్వహించారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ సా ర్వజనిక ఉత్సవ కమిటీ పోలీసులు సంయుక్తంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎ లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుం డా గట్టి బందోబస్తు మధ్య వినాయక ఉత్సవాలు నిర్వహించాలని జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మణికరావు, పార్టీ నాయకులు నిమజ్జనంలో పాల్గొని పూజలు నిర్వహించారు.