24-09-2025 12:45:20 AM
కూసుమంచి ఎస్సై నాగరాజు వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతుకు పట్టాదారు పాస్ బుక్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ తయరు చేసి ఇచ్చారని జక్కేపల్లి గ్రామానికి చెందిన కళ్ళెం అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున గంగాబండ తండ ఫ్లైఓవర్ దగ్గర నకిలీ పాస్ పుస్తకాల తయారీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను కూసుమంచి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందుతుల నుంచి రెండు కార్లు, 10 నకిలీ పట్టాదారు పాస్ బుక్స్ స్వాదినం చేసుకునట్లు తెలిపారు. నిందితుల్లో కొత్త జీవన్‌రెడ్డి, జక్కేపల్లి, కొండూరి కార్తీక్, గార్ల బయ్యారం,
మహబూబాద్ జిల్లా ప్రస్తుతం సాయిగణేష్ నగర్, ఖమ్మం, పారిపత్తి సాయి కుశాల్, టీచర్స్ కాలనీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జక్కపల్లి వరప్రసాద్ ఇందిరా నగర్ కాలనీ, లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నందమూరి లక్ష్మన్‌రావు, బొక్కలగడ్డ, మంచికంటి నగర్, ఖమ్మం, ప్రస్తుతం మసీద్ ఏరియా, ఏకే ప్రింటింగ్స్, సారాపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నారు. తయారు చేసిన దొంగ పట్టాదారు పాస్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.