24-09-2025 12:46:34 AM
- నవంబర్ 23న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
-ఎంపికైతే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం
- ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత
- దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం
సంగారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):పేద విద్యార్థులు ఆర్ధిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపి వేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్) అందిస్తోంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందు లో ఎంపికైతే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
పరీక్ష విధానం..
మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్‌ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శా స్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సం బంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సా ధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్‌ఈ తెలంగాణ వెబ్ సైట్ను పరిశీలించాలి.
ప్రణాళికతో చదివితే..
మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉం టుంది. పార్ట్-ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, సంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజి కల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్కు సంబంధించిన ఆం శాలు ఉంటాయి. పార్ట్-బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మా ర్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తె లుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్ర ణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
అర్హత ఇలా...
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సా ధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మం డల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠ శాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, ది వ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదం డ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపుఉండాలి.