21-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మల్టీ లెవెల్ గొలుసు కట్టు స్కీం లా నిర్వహణతో ప్రజల ను మభ్యపెడుతూ మోసానికి పాల్పడుతున్న మల్టి లెవల్ స్కీం నిర్వాహకులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఒక ఫిర్యాది అయిన తోకల బక్కన్న పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన దరఖాస్తు తను మోసపోయి నట్టు ఫిర్యాదు చేశాడు.
అతను అక్టోబర్ 13 వ తారీఖున కోటగల్లీ లోని కెనరా బ్యాంకు పక్కకు ఎఫ్ ఉన్నటువంటి బిఎంబి కంపెనీ చూసి అక్కడికి వెళ్ళగా నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ నన్ను పిలువగా ఫిర్యాది అతనిని కలిసి అతని ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం అయినటువంటి బీఎంబీ కంపెనీ గురించి తెలుసుకొని అది ఇంగ్లాండు దేశంకు చెందినదని, దాంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని, అలాగే వివిధ రకాలైన గృహ ఉపకరణాలు మరియు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చునని ఎంబిటి నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో ఆరోపించాడు.
నిందితుడు అమాయక ప్రజల ను మోసం చేసినట్లు సిపి సాయి చైతన్య వివరించారు. గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుని మోసపూరిత మాటల ద్వారా నమ్మించగా ఫిర్యాదుదారుడు నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ మాటలు నమ్మి, నిందితుడు పంపిన లింకు ద్వారా తన ఫోన్లో బీఎంబీ కంపెనీకి సంబంధించిన ఆప్ ను ఇన్స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయి, సుమారు రూ : 84,398 రూపాయలను వేరువేరు వేరువేరు లెవెల్స్ లలో విడుదల వారీగా,
నిందితుడు ఫోన్లో పంపినటువంటి లింకుల ద్వారా, కంపెనీ యాప్ నందు ఫోన్పే ద్వారా నిందితుడు పంపినటువంటి లింకులలో పెట్టుబడి పెట్టి నిందితుడు చెప్పిన మాయ మాటలకు ఆకర్షితుడై తన రక్తసంబంధీకుల తరఫున తనకు తెలిసిన వారి తరఫున కూడా కొంత మొత్తంలో నగదును కంపెనీ ఆప్ యందు పెట్టుబడి పెట్టి, అతని కంపెనీ వాలెట్ అకౌంట్ యందు జమ అయినటువంటి ఫేక్ ఎమౌంటును విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా, అమౌంట్ విత్డ్రా కాలేదని తాను మోసపోయానని తెలుసుకొని, పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిపి తెలిపారు.
కేసులో ప్రధాన నిందితుడు ఇదే తరహాలో సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిపారు . బిఎంబి కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందని ఆయన వివరించారు. బాధితులు ఇట్టి బిఎంబి కంపెనీ లో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు కోటి నుండి కోటిన్నర వరకు కలదన్నారు. ప్రస్తుతం ఇట్టి బీఎంబీ కంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయటం లేదు.
కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా బేస్డ్ లింకులని ఆ లింకుల ద్వారా పంపినటువంటి కోటి నుండి కోటినర రూపాయలు చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు సమాచారం అందినట్లు, ఈ సందర్భంగా ప్రజలు ఎవ్వరు కూడా ఇలాంటి మోసపూరితమైనటువంటి మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ చైన్ సిస్టం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందాలని ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టకుండా మోసపోకూడదని సూచించారు.
ఇలాంటి ఎరవేసి మభ్యపెట్టి మోసపూరిత మాటలు చెప్పి ఆకర్షణ చేసేటువంటి వ్యక్తుల గురించి తమ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించి, దరఖాస్తు ఇవ్వాలని ఆయన కోరారు.