calender_icon.png 21 November, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాపిల్లలను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

21-11-2025 12:00:00 AM

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

2019 కన్యలాల్ బాగ్‌లో ఘటన

వికారాబాద్, నవంబర్ -20 (విజయక్రాంతి): భార్య, పిల్లలను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం రాజయ్య తీర్పు ని చ్చారు. 2019 ఆగస్టు 4న వికారాబాద్ పట్టణంలోని కన్యలాల్ బాగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాండూరుకు చెం దిన ప్రవీణ్‌కుమార్ అప్పట్లో హైదరాబాద్ శివారులోని శేర్‌లింగంపల్లిలో నివాసం ఉండే వాడు.

అదే ప్రాంతానికి చెందిన చాందిని అనే వివాహిత తనకు పరిచయం కావడం తో ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.  దీంతో భర్తను వదిలేసి కొడుకుతో కలిసి ప్రవీణ్‌కుమార్ వెంట వ చ్చింది. పెళ్లి చేసుకున్న ప్రవీణ్‌కుమార్ ఐదేళ్లపాటు అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఓ కూతురు కూడా ఉంది. మద్యానికి బానిసైన ప్రవీణ్‌కుమార్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019 ఆగస్టు 3న ప్రవీణ్‌కుమార్ తల్లి, సోదరుడు  మద్యం సేవి స్తుండటం చూసిన చాందిని ఆగ్రహించింది.

దీంతో ప్ర వీణ్ కుమార్.. అదే రోజు చాందినితోపాటు కుమారుడు, కూతురిని హత్య చేశా డు.అప్పటి డీఎస్పీ సీతారాం, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు కేసు నమో దు చేసి ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన జిల్లా కోర్టు నేరం రుజువు కావడంతో ప్రవీణ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్‌రెడ్డి శిక్ష పడేలా కృషి చేశారని ఎస్పీ నారాయణ రెడ్డి చెప్పారు.