calender_icon.png 5 November, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

05-11-2025 01:25:53 AM

  1. ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా.. కొడవళ్లతో దాడి
  2. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు.. ముగ్గురికి గాయాలు

చెన్నై, నవంబర్ 4: తమిళనాడులోని కొయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్ర యం వద్ద విద్యార్థినిని అపహరించి, ఆపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముగ్గు రు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. నగరానికి చెందిన ఓ యువతి ఆది వారం రాత్రి తన స్నేహితుడితో కలిసి కారు లో నగరంలోని ఎయిర్‌పోర్ట్ ప్రాంతానికి వచ్చింది. ఇదే సమయంలో అక్కడికి ముగ్గు రు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు.

విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి ఆమెను అపహరించారు. బలవంతంగా ఆమెను విమానా శ్రయం వెనుక వైపునకు తీసుకెళ్లి గ్యాంగ్ ర్యాప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి నిందితులు పారిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం వేట ప్రారంభించారు.

నిందితు లను గుణ, కరుప్పసామి, కాళీశ్వరన్‌గా నిర్ధారించారు. మంగళవారం ఉదయం ముగ్గురు నిందితుల ఆచూకీని వలంకినార్‌లో గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా నిందితులు కొడవళ్లతో దాడికి యత్నించరారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన నిందితులను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో హత్య, దోపిడీ కేసులు ఉన్నట్లు  గుర్తించారు.