19-08-2025 12:00:00 AM
మునిపల్లి, ఆగస్టు 18: మునిపల్లి మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో పంచాయతీ అధికారులు చెత్తను తొలగించారు. ఈనెల 18న విజయక్రాంతి దినపత్రికలో చెత్త తీసేది ఎవరు ? అనే కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన గ్రామ పంచాయితీ అధికారి చెత్తను తొలగించారు. సోమవారం ఉదయం పంచాయతీ ట్రాక్టర్ లో చెత్తను తీసుకెళ్లారు. గ్రామంలో గల జడ్పిహెఎస్ పాఠశాల సమీపంలో కంపు కొడుతున్న చెత్తను తొలగించడంతో గ్రామస్తులు, విద్యార్థులు సంతోషం;వ్యక్తం;చేశారు.