calender_icon.png 19 August, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీకుంట కేంద్రంలో రిక్వెస్ట్ బస్టాప్ కు చర్యలు

19-08-2025 12:00:00 AM

- స్థలం చూడాలని మండలం నాయకులు ఆదేశించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట ఆగస్టు 18 : మండల కేంద్రంలో బస్ స్టాప్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తూ విజయ్ క్రాంతి దినపత్రిక ’ బస్టాండ్ కు మోక్షం లభించేనా ? ’ అనే కథనాన్ని ప్రచురితం చేసింది. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే సంబంధిత మండల నాయకులను ఆదేశించారు. వెంటనే రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేయాలని సంబంధిత నాయకులను ప్రత్యేకంగా ఆదేశించారు.

ఈ విషయంపై మాజీ సర్పంచ్ కురుమూర్తి దేవస్థానం మాజీ చైర్మన్ ఎస్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యదర్శులు జి ప్రతాప్,ఎస్ శేఖర్, ఎండి శేరి గౌస్, యాకోబు, ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్ మండల కేంద్రంలో రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. రిక్వెస్ట్ బస్టాప్ తో పాటు తదితర సదుపాయాలను కల్పించేందుకుగాను మూడా నుంచి రూ 47 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలియజేశారని మండల నాయకులు తెలిపారు. రిక్వెస్ట్ బస్టాప్ తో పాటు మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని స్థానికులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులను మంజూరు చేయించినందుకుగాను మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.