26-11-2025 12:32:22 AM
కాంగ్రెస్ అధిష్ఠానానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి
బెంగళూరు, నవంబర్ 25 : అధికార మార్పుపై వస్తున్న ఊహాగానాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఎడతెగకుండా వస్తున్న వార్తలకు శుభంకార్డు వేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సిద్ధరామయ్య కోరారు. 2023లో కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది.
నవంబర్ 20న ఆ రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దీంతో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా ఉంటారని ఉప ముఖ్యమంత్రి డీకే చెబుతున్నా.. మరో వైపు సీఎం పదవిపై ఆశను వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని ఇంకోవైపు విపక్ష నేతలు జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉంది. మరికొన్ని నెలల్లో అనుహ్య పరిణామాలు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీయవచ్చు అని కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఇలా స్పందించారు.