calender_icon.png 27 October, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా!

27-10-2025 12:17:44 AM

  1. ఇస్నాపూర్లో రెచ్చిపోతున్న రీ ఫిల్లింగ్ మాఫియా
  2. స్థానిక నేతల అండదండలు 
  3. పట్టించుకోని అధికారులు

పటాన్ చెరు, అక్టోబర్ 26 :పేదలకు అందాల్సిన సబ్సిడీ సిలిండర్లు అక్రమ వ్యా పారుల చెంతకు చేరుతున్నాయి. ఒక పెద్ద సిలిండర్లోని గ్యాస్ను ఐదు చిన్న సిలిండర్లలో నింపి వ్యాపారం చేస్తున్నారు. ఈ దందా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ తో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

సంబంధిత శాఖల అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు. ఇస్నాపూర్లో నిత్యం వందల సంఖ్యలో చిన్న సిలిండర్ల విక్రయా లు జరుగుతున్నాయి. ఇక్కడ స్థానికేతర కా ర్మికులు, పేదలు, ముఖ్యంగా బ్యాచిలర్ కార్మికులే అధికం. వీరిలో చాలా మందికి స్థానికం గా గ్యాస్ కనెక్షన్లు లేకపోవడంతో మార్కెట్లో సులభంగా దొరికే చిన్న సిలిండర్లను వినియోగిస్తున్నారు.

చిన్న సిలిండర్ల అమ్మకందా రులు సబ్సిడీ గ్యాస్ను తమ అక్రమ వ్యాపారానికి వాడుతున్నారు. ప్రభుత్వం అందించే గ్యాస్బండలో సుమారు 14.5 కేజీల వరకు గ్యాస్ ఉంటే.. వీటి నుంచి చిన్న సిలిండర్లోకి రెండు, రెండున్నర కిలోల గ్యాస్ను నింపి(కేజీకి రూ.125 నుంచి రూ.140 చొప్పున) విక్రయిస్తున్నారు.

రూ.1,120కి లభించే ఒక్కో సిలిండ్ప అదనంగా రూ.700 వరకు గడిస్తున్నారు. అనుమతి లేకుండా ఇలా అక్రమం గా రీఫిల్లింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తు న్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ అయ్యారు. డబ్బులకు ఆశ పడి ఇలాంటి అక్రమ చర్యలకు పూనుకుని దందా కొనసాగిస్తున్నారు. 

రీ ఫిల్లింగ్ ప్రమాదమని తెలిసినా

ఇస్నాపూర్తో పాటు, పారిశ్రామిక ప్రాం తంలో అక్రమ సిలిండర్ రీ ఫిల్లింగ్ కేంద్రా లు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు వ్యాపార కేంద్రాల్లో అన్ని వస్తువుల మాదిరిగానే చిన్న సిలిండర్ల అమ్మకాలు సాగిస్తారు. సబ్సిడీ సి లిండర్ నుంచి చిన్న సిలిండర్లోకి గ్యాస్ను రీ ఫిల్లింగ్ చేయడం ప్రమాదకరం.

ఈ ప్రాంతం లో ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగినా.. అక్రమార్కులు  సులభంగా వచ్చే ఆదాయం కోసం ఈ దందాను నడుపుతున్నారు. రీ ఫి ల్లింగ్ కేంద్రాలు జనవాసాల మధ్యే సాగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది.  ఈ అక్రమ వ్యవహారంపై దృష్టి సారించాల్సి న పౌరసరఫరాల శాఖ అధికారులు నామ మాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు. 

మామూళ్ళ మత్తులో అధికారులు

గ్యాస్ సిలిండర్ల రీ ఫిల్లింగ్ కేంద్రాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత పౌర సరఫరాల శాఖ, పోలీసు శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నెలనెలా నిర్వా హకులు ఇచ్చే మామూళ్ళకు తలొగ్గి తనిఖీ చేయడం మర్చిపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం అలవాటుగా మారింది. అక్ర మ దందా కొనసాగిస్తున్నారని తెలిసినా ఆవైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.