27-10-2025 12:26:21 AM
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి
కామారెడ్డి, అక్టోబర్ 26, (విజయక్రాంతి): వచ్చే డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని చెప్పడాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఖండించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నూతన విద్యా విధానాన్ని ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.ప్రకటన చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాల్సిందేనని పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణ శివారులోని గెలాక్సీ గార్డెన్‌లో ఆదివారం పీఆర్టీయూ జిల్లా కమిటీ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల సమస్యలపై కూలంకష ంగా చర్చించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మా ట్లాడుతూ.. ప్రైమరీ పాఠశాలలను బలోపేతం చేయకుండా ఉన్నత పాఠశాలలు బలోపేతం కావన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు ఉపాధ్యాయ సం ఘాలకు తెలుసని, సంఘాల నాయకులతో చర్చించకుండా నూతన విద్యా విధా నంపై ప్రకటన చేయవద్దని కోరారు.
73 ఏళ్ల చరిత్రలో..
73 ఏళ్ల చరిత్రలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఇప్పటికీ నేలపై కూర్చుని చదువుకునే పరిస్థితులు ఉన్నాయని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య ఉందని అధికారులు చెబుతున్నారని, అటువంటప్పుడు 1:20 రేషియో అమలు చేయాలని, ఉపాధ్యాయులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బడులు బాగుంటే ఉపాధ్యాయులు బాగుంటారని, ఉపాధ్యాయులు బాగుంటే విద్య బాగుంటుందని, తద్వారా దేశం బాగుంటుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ‘మన ఊరు మనబడి’ అమలు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు తాత్కాలిక నిధులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకు లాలు, ఈ ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు.. అంతకుముందు ప్రభుత్వంలో మోడల్ స్కూల్స్ ఇలా ప్రభుత్వాలు మరినప్పుడల్లా పేర్లు మారుస్తున్నారన్నారు.
విద్యావ్యవస్థ బలోపేతం కోసం..
విద్యావ్యవస్థ బలోపేతం కోసం పీఆర్టీయూ కంకణం కట్టుకుందని దామోదర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బోధించడానికి టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. వర్కింగ్ టీచర్లకు టెట్ వర్తింపజేయకుండా ప్రభుత్వంతో పీఆర్టీయూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయించిందని గుర్తు చేశారు. 317జీవోపై ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, దానికోసం స్పౌజ్ బదిలీలు చేయాలని, లేదా లాంగ్ డిప్యుటేషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరితే 190 ఉత్తర్వులు ఇచ్చింద న్నారు.
వచ్చే విద్యా సవత్సరం లోపు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సెలవుల అథారి టీ ఎంఈవోలకు ఉండేలా చేస్తామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల హామీలను నెరవేర్చకపోతే డిసెంబర్ 9 తర్వాత పీఆర్టీయూ ఉద్యమానికి సిద్ధం అవుతుందని పేర్కొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తించేలా పీఆర్టీయూ కృషి చేస్తుందన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ విధానం చివరి దశలో ఉందని తెలిపారు. పెండింగ్ బకాయిలు వాయిదాల రూ పంలో ఇవ్వాలని జీఏసీలో పెడతామని తెలిపారు.
పనిదినాల్లో శిక్షణలు ఏర్పాటు చేయ డం సరికాదని దామోదర్ రెడ్డి అన్నారు. పాఠశాలలను తనిఖీ చేసే అవకాశం తాత్కాలిక అధికారులకు ఉండవద్దని, పర్మినెంట్ అధికారులకు తనిఖీ అధికారం ఇవ్వాలని కోరారు. అంతకుముందు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన వార్షిక ప్రణాళికను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనం తరం జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పిస్తున్నట్టు దామోదర్ రెడ్డి ప్రకటించారు.
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సదాశివుడు, రవికిరణ్, రాష్ట్ర కార్యదర్శులుగా లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నారాయణను నియమించినట్లు ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కుషాల్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.