calender_icon.png 16 May, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మం దారితప్పినప్పుడు వచ్చినవాడు గౌతమ్

16-05-2025 12:21:10 AM

అశ్విన్‌బాబు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతు న్న ఈ చిత్రానికి మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టీ గణపతిరెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతిథులుగా హాజరయ్యారు. ‘ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారమూ రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్’ అంటూ హీరో మనోజ్ మంచు వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో    చిత్రబృందం తమ అభిప్రాయాలు పంచుకున్నారు.