28-09-2025 05:09:41 PM
పాపన్నపేట (విజయక్రాంతి): భగత్ సింగ్ జయంతోత్సవాలలో భాగంగా ఆదివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షలు ఎర్రచాకలి పాపయ్య మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాలకే తన ప్రాణాలు అర్పించి, స్వాతంత్ర కాంక్షలను విద్యార్థులు, యువకులలో రగిలించిన షాహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన ఉత్సవాలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతున్న తరుణంలో స్వాతంత్రాన్ని అనుభవించే వారే లేకుండా పోయారని, భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు భగత్ సింగ్ ఆశయాల కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్వయ్య, మండల కార్యదర్శి అరుణ్, సహాయ కార్యదర్శి సంతోష్, మండల ఉపాధ్యక్షులు విక్రమ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.