calender_icon.png 18 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌష్టికాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యం

18-09-2025 12:30:06 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి ) : స్థానికంగా లభించే పౌష్టికాహారం పై కల్పించడమే కాకుండా పౌష్టికాహారం లోపం వల్ల జరిగే అనర్థాలను మహిళలకు తెలియజేయాలన్నదే పోషణ మాసం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి లు అన్నారు.బుధవారం ఘనపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు  పోషణ మాసం అనే ప్రత్యేక కార్యక్రమానికి వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు... పోషణ మాసం కార్యక్రమం సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు, పిల్లలకు స్థానికంగా లభించే ఆహార పదార్థాల్లో పౌష్టికాహారం ఎందులో ఉంటాయి, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల జరిగే లాభాలు ఏంటి, పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల గర్భిణీలు, పిల్లలు, మహిళల పై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయి అనే విషయాలను అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలకు  పౌష్టికాహార ఆవశ్యకత పై వివరించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ నెల రోజులు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, సి.డి.పి. ఓ లు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.