calender_icon.png 20 May, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాలకు పునరంకితమవ్వండి

02-05-2025 12:01:24 AM

సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు

ఖమ్మం, మే 1, (విజయక్రాంతి): 139వ మేడే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు పునరంకితం కావాలని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. అనన్య త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో అనేక హక్కులు సాధించుకున్నామని ప్రతి హక్కు వెనక పోరాటం దాగి ఉందన్నారు. 139వ మేడేను పురస్కరించుకుని గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్య్రం తర్వాత కార్మికుల పక్షాన నిలబడి పోరాడింది సిపిఐ, ఏఐటియుసి మాత్రమేనన్నారు. ప్రస్తుత పాలకులు సంపన్న వర్గాల సేవలో తరిస్తున్నారని పేదలను పూర్తిగా -విస్మరించారని ఆయన ఆరోపించారు. పేదలు మరింత పేదలవుతున్నారని సంపద కొంత మంది చేతుల్లో పొగుబడుతుందని ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమన్నారు.

ప్రజల హక్కుల పరిరక్షణ కార్మిక హక్కుల సాధన -ఎర్ర జెండాతోనే సాధ్యమవుతుందని ఎర్ర జెండా నేతృత్వంలో జరిగే పోరాటాలకు దన్నుగా నిలవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, -పోటు కళావతి, సిహెచ్ సీతా మహాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిల్లి రమేష్, జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, తాటి నిర్మల, యానాలి సాంబశివరెడ్డి, నూనె శశిధర్, బోడా వీరన్న, ఎస్ కె సైదా తదితరులు పాల్గొన్నారు.