02-05-2025 12:00:00 AM
కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కురుమల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిసిసి బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రహమతు హుస్సేన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
గురువారం కరీంనగర్లో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కి నిస్వార్ధంగా అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి పురమాల శీను తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాడని అన్నారు.
ఈ సమావేశంలో నాయకులు మల్యాల సుజిత్ కుమార్, పురం రాజేశం, లింగంపల్లి బాబు, రామిడి రాజిరెడ్డి,పొన్నం శ్రీనివాస్ గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,నాగుల సతీష్, ముక్క భాస్కర్,కుంభాల రాజ్ కుమార్, మార్గరాజు, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆడెపు సాగర్, అనరాసు కుమార్, లక్ష్మణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.