calender_icon.png 4 August, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఘర్.. ఘర్ బీజేపీ’ని విజయవంతం చేయాలి

04-08-2025 12:00:00 AM

హుజురాబాద్, ఆగస్టు 3(విజయక్రాంతి):భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈనెల మూడు నాలుగు తేదీన కరీంనగర్ జిల్లాలో తలపెట్టిన ఇంటింటికి ఘర్ ఘర్ బిజెపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వీణవంక మండలంలోని బెత్ గల్ లో బిజెపి మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో  ఘర్ ఘర్ బిజెపి ప్రోగ్రాం నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3 - ఆగస్టు 4, 2025 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి బిజెపి- ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షు డు కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు,

సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే‘ఘర్ ఘర్ బిజెపి’ ముఖ్య ఉద్దేశమన్నారు. బిజెపి ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ విస్తృత కార్యక్రమమని , ఇది కేవలం ఓ ప్రచార కార్యక్రమం కాదని , . స్థా నిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీని సంసిద్ధం చేయడానికి చేపట్టిన కార్యాచరణ అని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా పార్టీ నాయకులు, 

కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను , పనితీరు ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రా మాలలో ఎలాంటి వివక్షత లేకుండా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరిస్తారని తెలిపారు..మొక్కలు నాటే కార్యక్రమాల నుంచి మొదలుకొని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణ వరకు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి.