calender_icon.png 18 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో టెస్టుకు గిల్ అనుమానమే

17-11-2025 12:00:00 AM

కోల్‌కతా, నవంబర్ 16 : మెడనొప్పితో తొలి టెస్ట్ మధ్యలోనే తప్పుకున్న భారత కెప్టె న్ శుభమన్ గిల్ ప్రస్తుతం హాస్పిటల్‌లోనే ఉన్నాడు. గిల్ ఆరోగ్యం నిలకడగా ఉండని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ ప్రకటించింది. అతని పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. అయితే గిల్ రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత కెప్టెన్ తర్వాతి మ్యా చ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిద్రలేమితోనే గిల్‌కు మెడ నొప్పి వచ్చిందని తెలిపింది.