17-11-2025 12:00:00 AM
బ్యాటర్లే ఫెయిలయ్యారన్న గంభీర్
కోల్‌కత్తా, నవంబర్ 16 :బౌలర్ల హవా కొనసాగిన ఈడెన్ గార్డెన్స్ టెస్టులో భారత్ పరాజయం పాలైంది. బ్యాటర్లు కనీసం క్రీజు లో నిలవలేక చేతులెత్తేశారు. అయితే ఈ మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇలాంటి పిచ్‌ల వల్లనే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందంటూ మాజీ స్పి న్నర్ హర్భజన్‌సింగ్ వ్యాఖ్యానించాడు.
సచి న్, కోహ్లీ జట్టులో ఉన్నా కూడా ఇలాంటి పిచ్‌లపై జట్టును గెలిపించలేరంటూ మరికొందరు మాజీలు వ్యాఖ్యానించారు. అదే సమయంలో కోచ్ గంభీర్ వ్యూహాలపై మం డిపడుతున్నారు. కివీస్ చేతిలో వైట్‌వాష్ పరాభవం గుర్తు లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. సౌతాఫ్రికా స్పిన్ బలం తెలిసి కూడా ఇలాంటి పిచ్ అడగడంపై ఫైర్ అవుతున్నారు.
మరోవైపు పిచ్ విషయంలో తాము పూర్తి టగా సంతోషంగా ఉన్నామని మ్యాచ్ అనంతరం కోచ్ గంభీర్ చెప్పాడు. క్యూరేటర్ తాము అడిగిన పిచ్ ఇచ్చారని, పూర్తిగా సహకరించారని కితాబిచ్చాడు. ఈ వికెట్‌పై పరుగులు చేయకుండా భయపడేంతగా ఏమీ లేదని, బవుమా ఇదే పిచ్‌పై హాఫ్ సెం చరీ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. తమ బ్యాటర్లే విఫలమయ్యారని, అదే ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయొచ్చన్నాడు.