20-01-2026 12:00:00 AM
ముషీరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): యువతకు విలువైన కెరీర్ అవకా శాలను అందించేందుకు, శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పరిధిలో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, 3వ బ్యాచ్ ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమ వారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఎం.ఎస్సీ, బీ.టెక్, ఎం.టెక్, ఎంసిఎ కోర్సులు పూర్తిచేసిన 2022-25 పాస్ అవుట్ గ్రాడ్యుయేట్లు ఈ 90 రోజుల ఇంటెన్సివ్ కోర్సుకు అర్హులు. హైదరాబాద్‌లో ఆఫ్ లైన్ మోడ్లో నిర్వహించ బడతాయని తెలిపారు. ఏ ప్రాం తం వారయినా ఈ అవకాశాన్ని వినియోగించుకో వచ్చని చెప్పారు.
రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ : 9052372023 నెంబర్ లో సంప్రదించాలని అన్నారు. ఈ కోర్సులో బేసిక్, అడ్వాన్స్ పైథాన్, ఎస్ క్యూఎల్, పవర్ బీఐ, ఏఐ ఫండమెంటల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ కౌన్సెలింగ్ లో సమగ్ర శిక్షణ అందించ బడుతుందని తెలిపారు. కోర్సు పూర్తిచేసిన వారికి ప్లేస్మెంట్ కూడా అందించ బడుతుందని అన్నారు. తద్వారా విద్యార్థులు డేటా ఇంజినీరింగ్ రంగంలో మంచి కెరీర్ను ప్రారంభించగ లరని పేర్కొన్నారు. క్లాసులు శ్రీ సత్య సాయి స్కిల్ సెంటర్, హైదరాబాద్ లో ఆఫ్ లైన్ మోడ్లో నిర్వహించ బడతాయని తెలిపారు.