calender_icon.png 2 August, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల వసతి గృహం తనిఖీ

02-08-2025 12:00:00 AM

  1. వసతులను పరిశీలించిన కమిషనర్ టీ రమేష్
  2. విద్యార్థులతో కలిసి భోజనం

బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 1 :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ టి రమేష్  సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు.. ఈ సందర్భంగా భాగంగా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను సమీక్షించి, ప్రస్తుత సదుపాయాలను పరిశీలిం చారు.

కమిషనర్ టి రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సమర్థవంతంగా అమలు చేయాల న్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, అభ్యాసానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు అవసరమైన సూచనలు చేశారు. కమిషనర్ రమేష్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆత్మీయతను పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ బి. సాయి కిరణ్, టౌన్ ప్లానింగ్‌అధికారి యస్. చంద్రశేఖర్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ జి. సునీల్ పాల్గొన్నారు.