calender_icon.png 3 August, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ మహిళలు ఆర్థికంగా ఎదగాలి

02-08-2025 12:00:00 AM

  1. మొహువా లడ్డూ యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే
  2. నార్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటన

అదిలాబాద్, ఆగస్టు 1(విజయ క్రాంతి) : ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధి రంగాలను సద్వినియోగం చేసుకోని  ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అస్పరేషనల్ బ్లాక్ నార్నూర్ మండలం లో ఆసిఫాబాద్ శాసన సభ్యులు కోవ లక్ష్మీ తో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఖైర్ ద్వాట గ్రామంలో  మొహువా (ఇప్పపువ్వు) లడ్డు యూనిట్ ను ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

అదేవిధంగా భీంపూర్ స్కూల్ లో సైన్స్ లేబరేటరీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో కమ్యూనిటీ ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించి, ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద రూ. 6 లక్షల గ్రాంట్ ద్వారా మొహువా లడ్డు మిషన్, పుల్వరైజర్ మిషన్, తుకడా మిషన్, డఫ్ మిషన్ లాంటి మిషనరీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనులు తయారు చేస్తున్న మొహువా లడ్డులు ఎంతో రుచికరంగా ఉన్నాయని, ఆరోగ్య పరిరక్షణకు అనుగుణంగా, నాణ్యమైన ప్ర మాణాలతో లడ్డులను తయారు చేయాలి, అని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, డీఆర్డీఓ రాథోడ్ రవీందర్, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, APౄ గోవింద్ రావు, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఏపీఎం మైస్ రమేష్, పలువురు అధికారులు, మొహువా లడ్డు యూనిట్ సభ్యులు ఉన్నారు.