12-08-2025 12:47:35 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు08: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అర్వపల్లిలోని కస్తూర్బా బాలికల పాఠశాల మరియు కళాశాల వర్షం వచ్చిందంటే నీటమునగాల్సిందే.. జెడ్పీ హైస్కూల్, కేజీబీవీ భవనాలు గ్రామ శివారులోని కుంట పక్కనే నిర్మించారు.దీంతో వర్షం వచ్చిందంటే అర్వపల్లి గుట్టల నుంచి వచ్చే వరద నీరంతా ఆ కుంటలోకి వస్తుంది.భారీ వర్షాలు కురిస్తే వరద నీరు సమీపంలోనే ఉన్న కేజీబీవీ,హైస్కూల్ ఆవరణలోకి వచ్చి చేరుతుంది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేజీబీవీ పూర్తిగా జలమయమైంది.
ఈ పాఠశాలను ఈ సంవత్సరమే కళాశాలగా అప్ గ్రేడ్ చేశారు. కేజీబీవీలో ప్రస్తుతం 242 మంది విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరు స్కూలుకు వెళ్లేదారిలో మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయాయి.ఈ నీటిలోంచి వెళ్లలేక బాలికలు,సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు.వరద నీరు ఆవరణలో చేరడంతో పాములు,తేళ్లు సంచరిస్తున్నాయని విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇట్టి విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారి స్పందించలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సార్లు స్పందించి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చేయాలని విద్యార్థినిలు మొరపెట్టుకుంటున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
వర్షాలు వచ్చినప్పుడల్లా వరదనీరు వచ్చి పాఠశాలలో చే రుతుంది. ఈ విషయాన్ని తనతో పా టు గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్వోలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.అయినా ఫలి తం లేదు.వర్షాలకు పాఠశాల దారి ఆవరణ అంతా వాననీ టితో నిండిపోయింది.
నాగరాణి కేజీబీవీ ఎస్‌ఓ, అర్వపల్లి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
కేజీబీవీలో వర్షపునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వ ర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు. పాలకులు మారిన సమస్యలు తీరడం లే దు. ఎమ్మెల్యే, కలెక్టర్ లు చొరవ చూపి వి ద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూ డాలి. పోలెబోయిన కిరణ్,
పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.