calender_icon.png 12 August, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంగిల్ రమ్మీ ప్రమోషన్‌లో పారితోషికమెంత?

12-08-2025 01:25:43 AM

  1. చట్టపరమైన అనుమతులపై విచారించారా?
  2. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రానాపై ఈడీ ప్రశ్నల వర్షం 
  3. కీలక సమాచారం సేకరణ
  4. ఎల్లుండి విచారణకు నటి మంచు లక్ష్మి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (వి జయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్ర మోషన్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మ రం చేసింది. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృ ష్టిస్తున్న ఈ కేసులో భాగంగా, ప్రముఖనటుడు దగ్గుబాటి రానా సోమవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు విచారణ సాగింది. అధికారులు రానాపై ప్రశ్నల వర్షం కురిపించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు చేశారు.

ఈడీ అధికారులు ప్రధానంగా ‘జంగిల్ రమ్మీ’ అనే గేమింగ్ యాప్ ప్రమోషన్‌పై దృష్టి సారించినట్టు సమాచారం. ‘జంగిల్ రమ్మీ’ని ప్రమోట్ చేయడానికి మీరు ఎంతకాలం కాంట్రాక్ట్ తీసుకున్నారు? మీతో పాటు ఈ ఒప్పందంలో ఇంకా ఎవరెవరున్నారు? ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటి? దుబాయ్ కేం ద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ నుంచి మీకు అందిన పారితోషికం ఎంత? అది ఫీజు రూపంలో ఇచ్చారా లేక కమీషన్ రూపంలో ఇచ్చారా?

ఆ చెల్లింపులు మీకు ఎలా అందాయి? డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలో జమ చేశారా లేక బిట్‌కాయిన్ల వంటి ఇతర రూపాల్లో చెల్లించారా? ఇది గేమింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా? ఒప్పందం చేసుకొనే ముందు యాప్‌కు ఉన్న చట్టపరమైన అనుమతులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల గురించి విచారించారా? సోషల్ మీడియా వేదికలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఈ యాప్‌కు ప్రచారం కల్పించారు? మీ ఒప్పందం ఎప్పుడు ముగిసింది? ఈ ప్రశ్నలతో అధికారులు రానాను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.

వరుసగా సినీ ప్రముఖులు..

వాస్తవానికి జూన్ 23నే రానా విచారణకు హాజరుకావాల్సి ఉన్నా, ముందస్తు షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా హాజరుకాలేకపోయా రు. దీంతో అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయగా, ఆయన సోమవారం విచారణకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఆరు గంట లు, యు వ హీరో విజయ్ దేవరకొండను నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు.

వారి నుంచి రాబట్టిన సమాచారం తోనే రానా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 13 ఇదే కేసులో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఈడీ ఎదుట హాజరుకానున్నారు. వరుసగా టాలీవుడ్ ప్ర ముఖులను ఈడీ విచారణకు పిలుస్తుండటంతో, ఈ  కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయోనని ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది.