calender_icon.png 28 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రుల కృషితోనే తండాకు సీసీరోడ్డు

25-07-2025 12:00:00 AM

ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు 

వనపర్తి, జూలై 24 ( విజయక్రాంతి ) : మాజీ మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి తోనే వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వశ్య తండాకు సిసి రోడ్డు ను వేయించడం జరిగిందని మాజీ కౌన్సిలర్ శాంతి రమేష్ నాయక్ అన్నారు. గురువారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక నాయకులతో కలిసి ఆయన కేక్ కటింగ్ కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తండా ఏర్పాటు నుంచి సిసి రోడ్డు లేక ఇబ్బందులు పడిన సంఘటనలు చాలా ఉన్నాయి మాజీ మంత్రుల సహకారంతోనే సిసి రోడ్డు వేయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, మన్యం నాయక్, గోవింద నాయక్, లచ్చిరాం నాయక్ పాల్గొన్నారు.