calender_icon.png 22 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

22-01-2026 03:35:16 AM

  1. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
  2. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలంటే  ఆషామాషి కాదు.. నిర్లక్ష్యంగా ఉండొద్దని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నాయకులుందరూ సమన్వయంతో ఉండి కష్టపడి పని చేయాలని  సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంత్రి ఉత్తమ్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.  నిజామాబాద్ జిల్లాల్లో మెజార్టీగా మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు.

గతంలో మున్సిపల్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో మాత్రమే గెలిచామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు.  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మెజార్టీగా పట్టం కట్టారని, 70 శాతానికిపైగా గెలుచుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాల న్నారు. బీజేపీ ఎప్పటిలాగనే మత రాజకీయాలు చేస్తుందన్నారు.  సమావేశంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మండవ వెంకటే శ్వరరావుతో, పార్టీ నేతలు హాజరయ్యారు. 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి చేయలేదు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై తాను దాడి చేసినట్లుగా వస్తున్న వార్తలపై వాస్తవం లేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. అలంపూర్ నియోజక వర్గంలో కొన్ని శంకుస్థాపనలు జరిగే సమయంలో తాను, ఎమ్మె ల్యే విజయుడు కలిసి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అలంపూర్ నియోజక వర్గంలో ౫గ్రామాలను ఎస్బీఐ దత్తత తీసుకుందని, ఆ గ్రామాల్లోని స్కూళ్లలో సైన్స్‌ల్యాబ్, ఫ్రీ ఆర్మీ ట్రైనింగ్, ఆడపిల్లలకు సైకిళ్లు  అందించామని తెలిపారు.