calender_icon.png 23 July, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వాటా మాకివ్వండి

23-07-2025 01:28:03 AM

- ప్రణవ నిర్మాణ సంస్థ ఎదుట బాధితుల ధర్నా 

- బాధితులు, బిల్డర్ల పరస్పర ఆరోపణలు

- ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కోసమేనన్న బిల్డర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): ల్యాండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాన్ని విస్మరించి తమను ప్రణవ నిర్మాణ సంస్థ (బూరుగు ఇన్ఫ్రా డెవలప్‌మెంట్) మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా తమవద్ద అన్ని పత్రాలున్నా, తమ ఫిర్యాదులను ఎవరూ స్వీకరించడం లేదని వాపో యారు. ఈ మేరకు సుమారు వందమంది బాధితులు సోమాజీగూడలోని ప్రణవ భవనాల వద్ద ఇటీవల(ఈనెల 16) ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బాధితులు నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, బైఠాయించటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బాధితులు, హెచ్‌ఎస్‌ఈఎల్ సంస్థ మాజీ డైరెక్టర్లు రామసుబ్బారావు, రామ్ స్వరూప్ అగర్వాల్ మాట్లాడుతూ.. సోమాజీగూడలోని సర్వే నెంబర్ 229, 231లో నవభారత్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చైర్మన్ ఏఎస్ చౌదరికి చెందిన 2,2000 చదరపు గజాల భూమి ఉండగా, అందులో నుంచి 17,700 గజాల స్థలాన్ని హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1994లో కొనుగోలు చేసిందని వివరించారు. ఈ బోర్డులో మొత్తం 297 మంది సభ్యుల్లో 12 మంది డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. వీరిలో నుంచి రవికుమార్ అనే వ్యక్తి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.

2007 ఆగస్టులో హైద రాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రద్దు కావటం తో ఈ సంస్థ బోర్డు పేరును హైదరాబాద్ సెక్యూరిటీస్ ఎంటర్‌ప్రైజేస్ లిమిటెడ్‌గా మార్చిందని వివరించారు. ఇదే పేరిట కొనుగోలు చేసిన 17,700 చదరపు ఫీట్ల స్థలాన్ని బోర్టు తీర్మానం మేరకు విక్రయించుకునేందుకు, డెవలప్‌మెంట్ చేసుకునేందుకు వీలు గా సర్కారు అనుమతిచ్చినట్లు వారు వివరించారు. బోర్డుకున్న నిబంధనల ప్రకారం తీర్మానం ప్రకారం ఈ 17,700 స్థలాన్ని విక్రయించటం లేదా డెవలప్‌మెంట్ చేయాల్సి ఉండగా, చైర్మన్‌గా శివకుమార్ మాత్రం బోర్డు తీర్మానం లేకుండానే బూరుగు రవికుమార్ నిర్మాణ సంస్థ హెచ్‌ఎస్‌ఈఎల్ భూమిని 50/50గా డెవలప్‌మెంట్ చేసేందుకు ఒప్పందం చేసుకుందని, దీని ప్రకారం సభ్యులకు సుమారు 5 లక్షల 55 వేల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని సభ్యులకు కేటాయించాల్సి ఉండగా, చైర్మన్ శివకుమార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కార ణంగా స్థలం అభివృద్ది పనులు జరుగుతున్నాయని తామంత మౌనంగా ఉండిపోయా మని వెల్లడించారు. ఇపుడు ఒప్పందాన్ని విస్మరించి తమను మోసం చేస్తున్నారంటూ వాపోయారు. తమతో నిర్మాణ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం లక్షా 6 వేల చదర పు గజాల నిర్మాణ స్థలాన్ని తమకు ఇవ్వకుండా నిర్మాణ సంస్థ మోసం చేసిందని, దీనికి తోడు తమ సంస్థకు చెందిన ఆఫీసుతో పాటు బస్‌స్టాపు కోసం మెయిన్‌రోడ్డు లో కేటాయించిన 650 చదరపు అడుగుల స్థలాన్ని సైతం తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. 

అడ్డదారిలో అనుమతులు..

హెచ్‌ఎస్‌ఈఎల్ సంస్థకు చెందిన సు మారు 17,700 చదరపు గజాల భూమిలో డెవలప్‌మెంట్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి నిర్మాణదారులు అడ్డదారిలో అనుమతులు తీసుకువచ్చినట్లు హెచ్‌ఎస్‌ఈఎల్ సంస్థ మాజీ డైరెక్టర్లు రామసుబ్బారావు, రామ్‌స్వరూప్‌అగర్వాల్ ఆరోపించారు. తాము 1994లోనే అప్పటి ఎంసీహెచ్‌కు అప్పగించిన 648 చదరపు గజాల భూమిని బస్‌స్టాప్, బస్‌షెల్టర్ల ఏర్పాటుకు అప్పగించామని, ఆ భూమిని సైతం ఆక్రమించి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. తామిచ్చిన భూమికి సంబంధించిన నష్టపరిహారం ఇం కా తమకు అందనందున ఆ 648 గజాల భూమిని నిర్మాణ సంస్థ తిరిగి తమకు అప్పగించాలని మాజీ డైరెక్టర్లు డిమాండ్ చేశారు.  

బ్లాక్ మెయిల్ కోసమే ధర్నాలు

సోమాజీగూడలోని హెచ్‌ఎస్‌ఈఎల్ భూమిని డెవలప్‌మెంట్ చేసేందుకు తమతో 2017లో ఒప్పందం చేసుకున్న సంగతి వాస్తవమేనని, వారి నుంచి తీసుకున్న 17,700 చదరపు గజాల స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన ప్లేస్ ఇచ్చేశామని హెచ్‌ఎస్‌ఈఎల్ మాజీ చైర్మన్ శివకుమార్ స్పష్టం చేశారు. సోమాజీగూడలోని ప్రణవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  ప్రణవ నిర్మాణ సంస్థ (బూరుగు ఇన్ఫ్రా డెవలప్ మెంట్ )కు చెందిన రవితో కలిసి మాట్లాడుతూ స్టాక్ ఎక్స్చేంజ్  అంటేనే గొడవ,కొట్లాటనే అని వ్యాఖ్యానించారు.

గతంలో ఎవరు డెవలప్‌మెంట్‌కు ముందుకురాలేదని, ఇపుడు డెవలప్‌మెంట్ చేసిన తర్వాత ఈ రకంగా ధర్నా చేయటం కేవలం బ్లాక్‌మెయిల్ కోసమేనని శివకుమార్ వ్యాఖ్యానించారు. వారి ఆందోళన, ధర్నా వల్ల ప్రాపర్టీ యజమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 50 శాతం రెసిడెన్షియల్‌తో పాటు కమర్షియల్ ప్లేస్‌ను ఇచ్చామని వివరించారు. ఒప్పందం ప్రకారం హెచ్‌ఎస్‌ఈఎల్ కంపెనీకి 50 శాతం అప్పగించిన తర్వాత పలువురు షేర్ హోల్డర్స్ ఈ రకంగా తమపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. నిరసన చేసినందుకు వారిపై కేసు నమోదు చేశామన్నారు. రాజ్‌భవన్ స్థలాన్ని కబ్జా చేశామంటున్నారని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అది కేవలం ఆరోపణ మాత్రమేనని, కేవలం రాళ్లు వెయ్యడం షేర్ హోల్డర్స్ అలవాటుగా మారిందన్నారు.

 హెచ్‌ఎస్‌ఈఎల్ మాజీ చైర్మన్ శివకుమార్

అగ్రిమెంట్ ప్రకారమే అప్పగించాం: బిల్డర్ రవి వివరణ

ఈ భూమిని డెవలప్‌మెంట్ చేసేందుకు తమతో 2017లో ఒప్పం దం చేసుకున్న సంగతి వాస్తవమేనని, వారి నుంచి తీసుకున్న 17 ,700 చదరపు గజాల స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన ప్లేస్ ఇచ్చేశామని నిర్మాణసంస్థ తరపున బిల్డర్ రవి వెల్లడించారు. 50 శాతం రెసిడెన్షియల్‌తో పాటు కమర్షియల్ ప్లేస్‌ను ఇచ్చామని వివరించారు. ఒప్పందం ప్రకారం హెచ్‌ఎస్‌ఈఎల్ కంపెనీకి 50 శాతం అప్పగించిన తర్వాత పలువురు షేర్ హోల్డర్స్ ఈ రకంగా తమపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. నిరసన చేసినందుకు వారిపై కేసు నమోదు చేశామన్నారు. కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే తమ మీద ఈడీ, ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ హోమ్ డిపార్ట్‌మెంట్, నేషనల్ కంపెనీ ఏజె న్సీ, జీహెచ్‌ఎంసీ తోపాటు ఇతరులకు షేర్ హోల్డర్స్ ఫిర్యాదు చేసినట్లు ఆయన  పేర్కొన్నారు.