calender_icon.png 29 December, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీలకు జీవం

29-12-2025 12:23:48 AM

  1. సీఎం హామీతో పంచాయతీలో చిగురిస్తున్న ఆశలు
  2. మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు
  3. చిన్న జీపీ లకు రూ. 5లక్షలు
  4. సొంత నిధులతో కొందరు సర్పంచ్‌లు అభివృద్ధి పనులకు శ్రీకారం
  5. ప్రస్తుతం పంచాయతీల ఖజానా ఖాళీ
  6. నిధులు మంజూరు అయితే పల్లెలు అభివృద్ధి బాటలో 
  7. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు 

ఆమనగల్లు, డిసెంబర్ 28 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి జీపీ లకు ఇచ్చిన హామీ ప్రస్తుతం నూతన సర్పంచుల్లో హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీలకు పది లక్షలు, చిన్న పంచాయతీలు గూడాలకు ఐదు లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తానని సీఎం ఇటీవల ప్రకటన చేశారు. దీంతో  పంచాయతీ లో అభివృద్ధి పనుల పై ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండు ఏళ్లుగా పంచాయతీలకు ప్రత్యేక పాలన కొనసాగడంతో  పంచాయతీల పాలన పడకా వేసింది. అభివృద్ధి పనులకు నిధులు లేక పంచాయతీ లు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి.

కొన్ని జీపీ లో మరి దయనీయ స్థితి నెలకొంది. మంచినీళ్ల ట్యాంకులో బ్లీచింగ్ పౌడర్ కొనలేని దుస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. నూతన సర్పంచ్ పాలకమండలి పదవి బాధ్యతలు సైతం స్వీకరించారు. ప్రస్తుతం సర్పంచులంతా  తమ గ్రామాల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించారు. ప్రస్తుతం జీపీ లో ఉన్న  సమస్యలు, వాటి  పరిష్కారానికి నిధులు సేకరణ... ప్రాథమికంగా పంచాయతీలో ఏమీ అభివృద్ధి పను లు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నిధులు లేకపోవడంతో నూతన పాల కవర్గాలు సతమతమవుతున్నాయి. కొత్తగా ఎన్నికై న తాము ఏదైనా చేయాలనే తలంపుతో కొందరు సర్పంచులు సొంత డబ్బులతో పనులు ప్రారంభించారు. మరికొందరి ఇంక పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో చిన్న పంచాయ తీలకు రూ.5లక్షలు, పెద్ద జీపీలకు రూ.10లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇస్తామని..

తద్వారా గ్రామాల్లో నెలకొన్న కొన్ని సమస్యలు తీరడంతో పాటు మౌలిక వసతులు సమకూ రుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కోస్గిలో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళ నంలో ప్రకటించడం తో కొత్త పాలకవర్గాల్లో నూతనో త్సాహం నింపింది. ప్రజలకిచ్చిన కొన్ని హామీ లైనా ప్రత్యేక నిధుల ద్వారా నెరవేర్చే అవకాశం లభిస్తోందని ఆశిస్తున్నారు. నిధు ల లేమితో సతమతమవుతున్న పలు జీపీ లకు వెసులుబాటు కలగనుందనే అభిప్రా యం సర్పంచ్‌లో వ్యక్తమవుతోంది.

 సమస్యల సుడిగుండంలో....

జిల్లాలో గత రెండేళ్లుగా పంచాయతీలు అన్ని సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీ ల్లో నిధుల కొరత తీవ్రం గా వేధిస్తోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన  కేంద్ర ప్రభు త్వం నుంచి విడుదలయ్యే 15వ ఆర్థిక సం ఘం రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్సీ) నిధులు విడుదల నిలిచిపోయింది.

దీంతో పంచాయతీ ఖజానాలో కాసుల్లేక కటకట నెలకొంది. ప్రస్తుతం గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని  దుస్థితి నెలకొంది. ప్రధానంగా పంచాయతీల్లో మౌలిక వసతులు తాగునీరు, పారిశుద్ధ్య, వీధిదీపాల నిర్వహణకు సైతం తిప్పలు పడాల్సి వస్తోంది. ఇక ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ ఖర్చులు భారంగా మారాయి. ఇలా అవస్థల నడుమ సాగుతున్న పంచాయతీలకు నూతన పాలక వర్గాలు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కానున్నాయి.

జిల్లాలో 526 జీపీలు

పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌ఈఎఫ్) సీఎం నిధుల నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రక టించడంతో నూతన  పాలకవర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో 526 జీపీలు ఉండ గా మాడ్గుల మండలంలోని నర్సంపల్లి లో కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేశారు అధికారులు.

ఇందులో నోటిఫైడ్ మేజర్ పంచాయతీలుగా మాడుగుల, కడ్తల, తలకొండపల్లి, మాడ్గుల, కొందుర్గు, కేశంపేట, వెల్జాల్, పడకల్, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, షాబాద్, అబ్దుల్లాపూర్మెట్ వీటికి తోడు పలు తండాలో  మేజర్ పంచాయతీలు తండాలు పంచాయతీలుగా పరి గణించవచ్చు.

జిల్లాలో ని 21 మండలా లో మేజర్ పంచాయతీ లకు రూ.10లక్షల చొప్పున, చిన్న జీపీలకు రూ. 5లక్షల చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక నిధులతో అదనపు ఆర్థిక భరోసా కలిగి సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు పంచాయతీల అర్థికాభివృద్ధికి దోహదపడతాయని నూతన సర్పంచులు, వార్డు సభ్యులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు

పంచాయతీ అభివృద్ధికి సీఎం నిధులుస్తే  పల్లెలు మంచిగా అయితాయి. ఆ పైసల తో  నీళ్లు, మోరి కాలువలు ఇంకా మా గ్రామం లో ఉన్న సమస్యల పరిష్కారం కు వినియోగించుకుంటాము. ప్రత్యేక నిధులు ఇస్తానన్న సీఎంకు మా గ్రామపంచాయతీ  తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 గుజ్జల లక్ష్మమ్మ, సర్పంచ్ చీపునుంతల తలకొండపల్లి మండలం

అభివృద్ధిపై దృష్టి సారించా

పంచాయతీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా ప్రత్యేక నిధులు విడుదలయితే పంచాయతీలకు పెద్ద ఊరట కలుగుతుంది. దానికి తోడు సీఎం సార్ ప్రత్యేక నిధులు ఇస్తానని ప్రకటన చేయడం సర్పంచులకు కొంచెం సంతోషం కలిగించే విషయం.

 న్యాలపట్ల నరేందర్‌రెడ్డి, సర్పంచ్, ఆకుతోటపల్లి, ఆమనగల్ మండలం

కొండంత ధైర్యం ఇచ్చింది

 సీఎం సారు పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం సర్పంచుల్లో కొండంత ధైర్యం ఇచ్చింది. ఇప్పటికే పంచాయతీలో అభివృద్ధి పనులకు నిధులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా విడుదల అయ్యే నిధులతో పాటు అదనంగా పంచాయతీకి నిధులు తీసుకొచ్చి గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తా. ఎన్నికలో ప్రజలకు ఇచ్చిన  ప్రతి హామిని నెరవేరుస్తా. 

 పాలకూర్ల మహేందర్ గౌడ్, సరికొండ, కడ్తల్ మండలం