29-12-2025 12:00:00 AM
తీర్చే నాధుడే లేడా..?
ప్రాణసంకటంగా మారిన పాలన
రేవల్లి, డిసెంబర్ 28(విజయక్రాంతి): ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు కొత్త హామీలు ఇస్తున్నారు.. కానీ ఆ గ్రామానికి మాత్రం పంచాయతీ కష్టాలు తీరడం లేదు. 2018 లో కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడి 7 ఏండ్లు గడుస్తున్నా, వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని శనాయిపల్లి గ్రామానికి నేటికి సొంత భవనం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత పాడుబడ్డ పాత పాఠశాల భవనంలోని కార్యకలాపాలు సాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సివస్తోంది.
గతంలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు కొనగిన ప్రభుత్వ పాఠశాల భవనానన్ని, 2018లో కొత్త పంచాయతీ ఏర్పడ్డాక తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. పాఠశాల విద్యార్థుల కోసం కొత్త భావన నిర్మించిన పాలకులు, పంచాయతీ కార్యాలయానికి మాత్రం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వయించారని గ్రామాస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయం నిర్వహిస్తున్న భవనం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
గోడలు నిలువున పగులు ఇచ్చి ఏ క్షణంలో కూలుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. వర్షం వస్తే చాలు పైకప్పుడు నుంచి నీరు కారి గ్రామ రికార్డులు తడిసి ముద్దవుతున్నాయి. ఎంతో విలువైన సమాచారం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సొంత భవనం నిర్మించాలని పలుమార్లు వినతలు అందజేసినా, కేవలం హమీలతోనే కాలయాపన చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా అవాంఛనీయ ఘటన జరగక ముందే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని గ్రామాసులో డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నిధులు మంజూరి చేసి, శనాయిపల్లకి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సొంత పంచాయతీ భవనాను నిర్మించాలని కోరుతున్నారు.