21-05-2025 12:00:00 AM
ఇల్లెందు, మే 20 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా నుంచి కారుణ్య ని యామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్ కార్మికుల వారసులకి మంగళవారం జి యం కార్యాలయం లో ఏరియా జియం వి.క్రిష్ణయ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా జి.యం మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి లో ఉ ద్యోగం రావడం అదృష్టంగా భావించాలని బాధ్యతగా పనిచేయాలని అలాగే భూగర్భ గనుల్లో పనిచేస్తే నైపుణ్యత పెరుగుతుందని, పనిప్రదేశంలో ఎల్లప్పుడూ రక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సం బంధిత అధికారులు తెలిపిన, రక్షణ సూత్రా లు నిత్యం పాటిస్తూ సంస్థ పురోగ అభివ్రుద్దికి తోడ్పడాలన్నారు.
ఉద్యోగంలో చేరిన యువత ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని ఉన్న త స్థనాలకు ఎదగాలన్నారు. సింగరేణి లో ఉద్యోగాలు వారసత్వంగా అందించిన తల్లిదండ్రులను మరియు కుటుంబాన్ని పోషిం చాలని అన్నారు.
రామగుండం-1 ఏరియా భూగర్భ గని లో పనిచేయుటకు నియామక ఉత్తర్వులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో యస్ ఓ టూ జి యం. రామ స్వామి, డిజిఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు ప్రాతినిధ్య సంఘం నుండి యాదగిరి, అధికారుల సంఘం నుంచి ముస్తఫా, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు