calender_icon.png 21 May, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు రెడ్డి సేవా సమితి సహాయం

21-05-2025 12:00:00 AM

మూసాపేట మే 20 : మండలం నంది పేట గ్రామ వాసి నందకిశోర్ రెడ్డి హైదరా బాద్ లో రోడ్డు ప్రమాదానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం దాదాపు రూ. 15 లక్షలు ఖర్చవు తోందని ఆర్థిక సహాయం కోసం పాలమూ రు రెడ్డి సేవ సమితిని సంప్రదించగా వెంటనే స్పందించిన పాలమూరు రెడ్డి సేవా సమితి దాతల ద్వారా సేకరించిన డబ్బులు మరి యు స్వంత నిధుల నుండి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ. 1,50,000/- చెక్కును విద్యార్థి మేనమామ వెంకటేశ్వర రెడ్డి కి మంగళ వారం సేవా సమితి కార్యాలయం లో అంద జేయడమైనది.

ఈ కార్యక్రమంలో సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తూము ఇంద్రసేనా రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేం దర్ రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్రామ రెడ్డి, ప్రచార కార్య దర్శి నల్లమద్ది సురేందర్ రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాళాలు అందించిన దాతలందరికీ  నంద కిశోర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.