calender_icon.png 4 October, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఘనంగా దుర్గామాతల నిమజ్జనం

04-10-2025 06:43:28 PM

కామారెడ్డి (విజయక్రాంతి): దసరా నవరాత్రుల్లో భాగంగా దుర్గామాతలను శరన్నవరాత్రులు కొనియాడిన భక్తులు గత రెండు రోజుల నుండి దుర్గామాతల నిమజ్జనం కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దేవునిపల్లి, రామేశ్వరపల్లి, తదితర గ్రామాల్లో దుర్గ మాత నిమజ్జన శోభాయాత్ర నిర్వహించిన అనంతరం స్థానికంగా ఉన్న చెరువులు కుంటల్లో అమ్మవారిని నిమజ్జనం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో, ముఖ్యమైన చోట్ల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

దుర్గామాత మాలదారుల సాములు భజనలతో, ఆటపాటలతో పట్టణంలో అన్ని మండపాల కమిటీ సభ్యులు వీధులలో భజనలు చేస్తూ అమ్మవారిని అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దుర్గామాతలను నిమజ్జనం చేశారు. బందోబస్తులో భాగంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి, సిఐ నరహరి, ఎస్సై రంజిత్, తదితరులు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. దుర్గామాతలను పట్టణ ప్రజలు, ప్రముఖ నాయకులు, సామి మాలదారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.