calender_icon.png 27 July, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయిలో భారీ వర్షం

26-07-2025 08:21:48 PM

కూలిపోయిన ఇల్లు, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని సంతాయిపేట  భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కన్కల్, నందివాడ, ఏండ్రియల్, దేమికలాన్, కాలోజివాడి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు వాగులు దాటి బయటకు వెళ్లలేకపోతున్నారు. కన్కల్, దేమికళాన్ గ్రామాల మధ్యలో వాగు రోడ్డు మీదుగా ప్రవహిస్తుండడంతో కంకల్, కరడుపల్లి వాసులు కామారెడ్డి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళోజి వాడి, సంగోజివాడి, బ్రాహ్మణపల్లి మధ్యలో వాగు రోడ్డు మీదుగా ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్యన రాకపోకలు స్తంభించాయి. బ్రహ్మాజీ వాడిలో రెండు నివాసపు ఇండ్లు, ఎర్రపహాడులో ఒక నివాసపు ఇల్లు కూలిపోయింది. సంబంధిత అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.