26-11-2025 12:00:00 AM
జాతీయ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్
దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
ఏటూరునాగారం,నవంబరు25(విజయక్రాంతి):1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందని ఈ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జాతీయ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్ అన్నారు.దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు గంపల శివకుమార్ అధ్యక్షతన భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ర్యాలీ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ ముదిరాజ్.మాల మహానాడు ఎమ్మార్పీఎస్ నేతకాని ఇతర ప్రజా సంఘాల నాయకులు ఎండి ఖలీల్ ఖాన్.చిటమట రఘు చెన్నూరి బాలరాజు వావిలాల నరసింహారావు గంపల శివకుమార్ దుర్గo లక్ష్మీకాంత్. కర్నే రమేష్. గద్దల నవీన్ లు మాట్లాడుతూ భారత దేశానికి నవంబర్ 26న రాజ్యాంగ రచన పూర్తి చేసుకొని ఆమోదించబడిందని అన్నారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు. చిటమట రఘు. చెన్నూరి బాలరాజు.ఎండి ఖలీల్. వావిలాల నరసింహారావు. గంపల శివకుమార్ .కుక్కల రాములు. ఉమాగాని రమేష్.దుర్గం లక్ష్మీకాంత్ కర్నే రమేష్ గద్దల నవీన్,రంజిత్,నావత్ కిరణ్.ఎజాజ్,వడిదల హనుమంతు. పాగా నాగరాజు. కందుకూరి రతన్ .సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.