calender_icon.png 20 January, 2026 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు...

22-10-2024 12:39:31 AM

చెరువులో పడి ఒకరు మృతి

నిజాంసాగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామంలో చెరువులో పడి వ్యక్తి మృతిచెందినట్లు పిట్లం ఎస్సై రాజు తెలిపారు. గౌరారం గ్రామానికి చెందిన మద్దెల సాయిలు(42) వారి బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. అనంతరం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.