calender_icon.png 20 January, 2026 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయిలో గిరిజన బిడ్డ ప్రతిభ

22-10-2024 12:40:43 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటుకొంది. గిరిజన క్రీడ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న ఆలం శైలజ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అండ ర్ 14 విభాగంలో జావీలిన్ త్రోలో కాంస్య పతకం సాధించింది.

సోమవారం గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి శైలజను అభినందించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ.. క్రీడల్లో గిరిజనులు రాణీంచాలని అకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఎంవో పుర్క ఉద్దవ్, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, ఏటీడీఏ చిరంజీ వి, జీసీడీవో శకుంతల, కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.