calender_icon.png 6 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్ల, మేకల అభివృద్ధి సమాఖ్యలో బర్రెలు, ఆవులను చేర్చాలి

25-07-2025 01:29:52 AM

రైతు కమిషన్ చైర్మన్‌కు కాంగ్రెస్ నేతల వినతి 

హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): రాష్ట్ర గొర్ల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యలో బర్రెలు, ఆవులను చేర్చాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కాంగ్రెస్ నేతలు చరణ్‌కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్ కోరారు. గురువారం రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానిరెడ్డి, భూమి సునిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు.

9 జిల్లాలకే పరిమితమైన సమాఖ్యలను 33 జిల్లాలకు వర్తింప చేయా లని, జిల్లా స్థాయిలో చైర్మన్లను నియమించాలని కోరారు. నాబార్డు ద్వా రా రుణాలు మరింత మెరుగుపడే వి ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చోర వ తీసుకోవాలని, దీని ద్వారా కురు మ, యాదవ సామాజిక వర్గాలకు ఉపాధి, రాజకీయ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.