calender_icon.png 2 October, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గుతున్న గోదావరి

02-10-2025 12:35:37 AM

భద్రాచలం, అక్టోబర్ 1, (విజయక్రాంతి):భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమేనా త గ్గుతున్నది. మంగళవారం 50 అడుగులు చేరుకున్న గోదావరి నీటిమట్టం బుధవారం సాయం త్రం 6 గంటలకు తగ్గుతూ 4 4. 80 అడుగులకు తగ్గింది. భద్రాచలం ఎగువన గల పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద కూడా తగ్గుతూ ఉన్నది.

దీంతో భద్రాచ లం నుండి దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాజేడు మీదుగా చత్తీస్గఢ్ వెళ్లే రహదారి ప్రారంభమైంది దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని ఆయా ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అ యితే 50 అడుగులు చేరుకోవడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గం లోని వందలాది ఎకరాలలో పంట నీటిలో మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి,మిర్చి, వరి తో పాటు పునాసపైర్లు సైతం నీటిలో మునిగిపోయాయి.

గతంలో సెప్టెంబర్ నెల ఆఖరు, అక్టోబర్ నెలలో గోదావరి వరదలు వచ్చిన దాఖలాలు లేకపోయినప్పటికీ పోలవరం నిర్మాణం అవడం తో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ముంపు గురయ్యే పంట పొలాలను ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుండగా, తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పోలవరం నిర్మాణం ఆఖరి దశలో ఉన్నందున తరచూ గోదావరి వరదల వల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు నష్టపోకుండా రెండు ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.