calender_icon.png 12 July, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కృషి చేయాలి

11-07-2025 10:42:08 PM

యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీల ఎన్నిక

వాజేడు,(విజయక్రాంతి): పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ అన్నారు. శుక్రవారం వాజేడు మండల పరిధిలో గల ఎడిజర్లపల్లి గ్రామపంచాయతీలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గౌరారపు సర్వేశ్వరరావు అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకర్లపూడి విక్రాంత్ గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి యువతను తీసుకువచ్చి పార్టీని మరింతగా బలపరిచి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసే విధంగా అందరూ కష్టపడాలని అన్నారు. ఎడుజర్లపల్లి గ్రామపంచాయతీ యూత్ కమిటీని ఏకగ్రీవంగా అధ్యక్షులు బట్ట శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కొండగొర్ల వెంకటేష్, కార్యదర్శి చెన్నం నవీన్, కోశాధికారి వాసం ఆదినారాయణ, వీరితోపాటు కార్యవర్గ సభ్యులు 8 మందిని ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు.