26-12-2025 12:23:31 AM
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట డిసెంబర్ 25 (విజయక్రాంతి): సాగునీటి సౌకర్యం లేని ప్రాంతానికి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీరు 24 గంటల కరెంటు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోనీ వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిశారు.
ఈ సందర్భంగా గెలిచిన సర్పంచు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు, 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యతగా కృషి చేయాలని అవసరమైన నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
సిద్దిపేట అర్బన్ మండలం, నంగునూరు మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచులు హరీష్ రావును కలవడంతో వారిని అభినందించారు. అనంతరం సిద్దిపేట అర్బన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఐదు నెలలుగా కాస్మోటిక్స్, మెస్ చార్జీలు ఇవ్వడం లేదంటూ హరీష్ రావు విమర్శించారు.
క్రిస్మస్ వేడుకల్లో...
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా క్రిస్మస్ పండుగను వర్ణించారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఉండటానికి ఏసుక్రీస్తు చేసిన కృషిని ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు.