26-12-2025 12:24:44 AM
బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్
సిద్దిపేట, డిసెంబర్ 25 (విజయక్రాంతి):భారత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని బిజెపి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ అన్నారు. గురువారం వాజపేయి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంచిట్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులతో కలిసి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు.
దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.దేశం కోసం, ధర్మం కోసం,జీవించిన మహా వ్యక్తి వాజపేయి అని కీర్తించారు.ప్రతిపక్ష నేతగా,విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా,ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి అందించిన సేవలు ఎన్నటికీ మరిచి పోలేమన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు కాసానిగొట్టు సంతోష్,గుండ్ల జనార్ధన్,తోడుపునూరి వెంకటేశం,కెమ్మసారం సంతోష్,భోగి శ్రీనివాస్,బొడ్డు సునీల్,దాబ నరేష్,చెంది సత్యనారాయణ, కనకరాజు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.