calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయత్రీ దేవి అలంకరణలో సరస్వతీ దేవి

24-09-2025 12:17:24 AM

మహాదేవపూర్, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున గాయత్రీ దేవి అలంకరణలో సరస్వతి దేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

కాళేశ్వరం వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గణపతి లలితార్చ న 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి నవగ్రహ రుద్ర పంచ సూక్త హోమములు, 11 గంటల నుండి 12 గంటల వరకు రాజ్య శ్యామల అర్చన, లలితార్చ న, చండి అర్చన అనంతరం రాత్రి 7:30 గంటలకు భజన కార్యక్రమాలు తీర్థ ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కాళేశ్వరం ఈఓ మహేష్ తెలిపారు.