18-05-2025 12:00:00 AM
మలక్‌పేట్, మే 17(విజయక్రాంతి): ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి లోపలికి చొరబడి బంగారం, నగదు తస్కరించిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథను ప్రకారం... చాదర్ ఘాట్ ఆజంపురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫహిముద్దీన్ ప్రైవేటు ఉద్యోగి.
శుక్రవారం రాత్రి అందరూ ఇంట్లోని చూస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రగతిలోని కిటికీ నుంచి లోపలికి ప్రవేశించాడు. ఇంట్లోని అలమారిని తెరిచి లోపలి కంపార్ట్మెంట్లో లోని బంగారు నగలు సుమారు 67 తులాలు, కొంత నగదును దొంగిలించాడు. ఉదయం ఉదయం లేచి చూసే సరికి అల్మారలోని వస్తువులు కింద చిందరవందగా పడి ఉన్నాయి.
లోపల ఉన్న బంగారం దొంగతనానికి గురైందని గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. పోలీసులు రంగ ప్ర వేశం చేసి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లుస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని కీలక ఆధారాలను సేకరించారు. చాదరఘాట్ డిఐ భూపా ల్ గౌడ్ నేతృత్వంలో, సీఐ బ్రహ్మ మురారి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.