27-09-2025 11:11:51 PM
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జూలై వాడ బస్తీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రెవెన్యూ కాలనీ రామాలయంలో విజయ దశమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విశ్రాంత అధికారి తక్కల్లపల్లి సోమేశ్వరరావు, ప్రధాన వక్తగా హిందూ జాగరణ మంచ్ అఖిల భారత సహ సంఘటన మంత్రి దేవేందర్ పాల్గొన్నారు. ప్రధాన వక్త దేవేందర్ జీ మాట్లాడుతూ సంఘటిత శక్తికి ప్రతీక విజయదశమి అన్నారు.
ధర్మ మార్గంలో నడుస్తున్న వారిని సo హరిస్తున్న రాక్షస శక్తిని అంతమొందించిన రోజే విజయ దశమి అన్నారు.ఆత్మవిస్మృతి చెందిన హిందూ సమాజాన్ని, అసంఘటితమైన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి 1925 విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ ను స్తాపించారన్నారు.ఈరోజు ప్రపంచంలోనే సంఘం ఒక వటవృక్షంలా ఎదిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదన్నారు. శాఖ అనే కార్య పద్ధతి ద్వారా ఆర్.ఎస్.ఎస్ గ్రామ, గ్రామాన, పట్టణాలలో, నగరాలలో,గిరిజన ప్రాంతాలలో వ్యాపించిందన్నారు.