14-01-2026 01:35:37 AM
రోడ్డు ఊడుస్తుండగా దొరికిన 45 లక్షల విలువైన బంగారం
తిరిగి పోలీసులకు అప్పగించిన పారిశుధ్య కార్మికురాలు
సీఎం స్టాలిన్ ఫిదా..
రూ.లక్ష రివార్డు అందజేత
చెన్నై, జనవరి ౧౩: రోడ్డు ఊడుస్తుంగా ఒక చిన్న బ్యాగ్ కనిపించింది. తెరచి చూడగా బ్యాగ్ నిండా ఆభరణాలు. అయినా.. ఆమె వాటిపై ఆశపడలేదు. నిజాయతీగా వాటిని పోలీసులకు అప్పగిచింది. ఈ ఘటన చెన్నై నగరంలో వెలుగు చూసింది. చెన్నై నగరానికి చెందిన పద్మ టీనగర్ ప్రాంత పారిశుధ్య కార్మికురాలు. ఆమె ఓ ఉదయం టీనగర్‌లోని రో డ్డును శుభ్రంచేస్తుండగా బ్యాగ్ కనిపించింది. తెరచి చూడగా సుమారు 40 తులాలకు పైగా బంగారు ఆభరణాలు కనిపించాయి.
వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి యజమానికి అప్పగించారు. పద్మ నిజాయతీని కొనియాడి సన్మానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందిం చి ఆమెను ప్రత్యేకంగా సచివాలయానికి పిలిపించి సన్మానించారు. ఆమె నిజాయతీకి గుర్తింపుగా ప్రభుత్వం తరపున రూ.లక్ష బహుమతిని కూడా అందజేశారు.