12-11-2025 12:30:03 AM
దుబాయ్, నవంబర్ 12: ఏడేళ్లకు ఓ వ్యక్తి కి అదృష్టం వరించింది. తన కూతురితో కొనుగోలు చేయించిన బిగ్ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఒకసారి ఒక సంఖ్య తేడాతో 15 మిలియన్ దిరమ్‌ల జాక్‌పాట్ మిస్సయి నా ఈ సారి మాత్రం 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లి రెండు దశాబ్దాలుగా భార్యా, పిల్లలతో దుబాయ్‌లో నివసిస్తూ అక్కడే స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుల సూచన మేరకు ఏడు సంవత్సరాలుగా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నా అదృష్టం కలిసి రాలేదు.
ఇటీవల తన కూతురితో కొనుగోలు చేయించిన టికెట్‌కు 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ ‘నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. నా కూతురి కోసం బహుమతి కొనుగోలు చేస్తాను. ఆమె నా అదృష్టం అని పేర్కొన్నాడు. తన అదృష్టాన్ని పరిక్షించుకోవడం ఇంతటితో ఆపనని, మరిన్ని బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటానని’ వెల్లడించారు.