09-07-2025 01:11:18 AM
- మూడు నెలల జీతాలు విడుదల
- 53 వేల మందికి ఊరట
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడు నెలల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి మొత్తం రూ. 150 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధు లు జమ కానున్నాయి. దీంతో ఒకటి, రెండు రోజుల్లో మూడు నెలల జీతాలను మల్టీపర్పస్ వర్కర్లు అందుకోను న్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 53 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లు పని చేస్తున్నారు. వారందరికి ఊరట కలిగిస్తూ ప్రభుత్వం మూడు నెలల వేతనాలు విడుదల చేసింది.